ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అ్యధ్యక్షునిగా రామకృష్ణ

by Thanuru Gopichand |

రాష్ట్ర సచివాలయ సంఘం (APSA) అధ్యక్షుడిగా గొలిమి రామకృష్ణ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అ్యధ్యక్షునిగా రామకృష్ణ
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర సచివాలయ సంఘం (APSA) అధ్యక్షుడిగా గొలిమి రామకృష్ణ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. సోమవారం ఉదయం నుంచి హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు ఓట్ల కౌంటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో రామకృష్ణ తన సమీప ప్రత్యర్థి కోట్ల రాజేశ్ పై 296 ఓట్ల మెజారీటతో విజయం సాధించారు. అమరావతి సచివాలయంలో ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో రామకృష్ణ ప్యానెల్ కు ఉద్యోగుల నుంచి విశేష మద్దతు లభించింది. అప్సా ఎన్నికల్లో మొత్తం 1,159 మంది ఉద్యోగులు ఓటర్లుగా ఉండగా, 1,105 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యక్షుడిగా పవన్ కుమార్ తన ప్రత్యర్థి గోపీ కృష్ణపై 338 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉపాధ్యక్ష(Women) స్థానంలో లక్ష్మణకుమారి తన ప్రత్యర్థి కవితపై 220 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీ (Sports) గా మధుబాబు తన ప్రత్యర్థి సత్యనారాయణపై 333 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జాయింట్ సెక్రటరీ(Organization)గా రాజేంద్ర ప్రకాశ్ తన ప్రత్యర్థిపై నాగూర్ మీరావలిపై 110 ఓట్ల ఆధిక్యంతో, ఇంకో జాయింట్ సెక్రటరీ (Women)గా సునీత తన ప్రత్యర్థి సాయిలీలపై 53 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొత్తం ఫలితాల్లో రామకృష్ణ ప్యానెల్ 7 పదవుల్లో విజయం సాధించగా.. ప్రధాన కార్యదర్శిగా రాజేశ్ ప్యానెల్ కు చెందిన నాతా ప్రసాద్ ఆరు ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అదనపు కార్యదర్శిగా ఇదే ప్యానెల్ కు చెందిన లింగారెడ్డి 183 ఓట్ల ఆధిక్యంతో విజయం పొందారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రామకృష్ణను సచివాలయ ఉద్యోగులు సన్మానించారు.

Next Story