పవన్ కల్యాణ్‌కు రామ్ గోపాల్ వర్మ సూటి ప్రశ్న

by Disha Web Desk 2 |
పవన్ కల్యాణ్‌కు రామ్ గోపాల్ వర్మ సూటి ప్రశ్న
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సూటి ప్రశ్న వేశారు. విజయవాడలో వ్యూహం, శపథం సినిమాలపై గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ ఏ విధంగా భ్రష్టు పట్టించారో పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. కాగా, ఎన్నికల వేళ ఆర్జీవీ తెరకెక్కించిన సినిమాలు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

జగన్‌‌కు రాజకీయంగా సాయం చేసేందుకే ఆర్జీవీ సినిమాలు చేస్తున్నాడని విపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే ఆర్జీవీ కూడా స్పందించారు. జగన్ జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాల ఆధారంగానే సినిమాలు తీస్తున్నట్లు తెలిపారు. జగన్ అంటే ఏంటో ఇందులో చూపిస్తానని.. తాను నమ్మిన నిజాన్ని చెబుతానని వర్మ వెల్లడించారు. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమేనని.. ఈ సినిమాలో ఎన్నో అంశాలు వుంటాయని, వైఎస్ వివేకా హత్య గురించి కూడా ఇందులో ప్రస్తావించానని ఆర్జీవీ తెలిపారు.


Next Story