పొంగిన అలుగు.. రాకపోకలు బంద్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-27 11:03:42  IST  )

కర్నూలు జిల్లాలో వర్షం దంచికొడుతోంది. ...

పొంగిన అలుగు.. రాకపోకలు బంద్
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District)లో వర్షం(Rain) దంచికొడుతోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి. ఆత్మకూరు మండలం సిద్ధాపురం అలుగు పొంగింది. దీంతో కర్నూలు(Kurnool)- గుంటూరు(Guntur) మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మిగనూరు గాంధీనగర్(Emmiganur Gandhinagar) జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆదోని రామజల చెరువు పొంగిపొర్లింది. దీంతో సమీపంలోని పంటల్లోకి నీరు చేరింది.

Next Story