ఏపీకి మరోసారి వర్ష సూచన

by Thanuru Gopichand |

అల్ఫపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో రేపు ఏపీలో వర్షాలు (AP Rains) కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది.

ఏపీకి మరోసారి వర్ష సూచన
X

దిశ, వెబ్ డెస్క్ : అల్ఫపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో రేపు ఏపీలో వర్షాలు (AP Rains) కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. ఇటీవలి తుఫాను ప్రభావం నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా కోలుకోకముందే వర్షాలు మళ్లీ కురుస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సంస్థ వివరాల ప్రకారం రేపటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. లోతట్టు ప్రాంతాల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మత్స్యకారులు వేట కోసం వెళ్లే అవకాశం ఉంటేనే వెళ్లాలని, లేని పక్షంలో చేపల వాట వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు కురిస్తే వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున, ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలని కోరుతున్నారు.

Next Story