ఏపీలో నేడు ఈ జిల్లాలకు వర్షసూచన

by Naga Rani Yarlagadda |

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం మొదలైన వర్షం.. సాయంత్రం వరకూ మోస్తరుగా పడుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు.

ఏపీలో నేడు ఈ జిల్లాలకు వర్షసూచన
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం మొదలైన వర్షం.. సాయంత్రం వరకూ మోస్తరుగా పడుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Next Story