- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా.. ప్రభుత్వ విప్ నుంచి తప్పుకుంటూ ప్రకటన
పభుత్వ విప్ పదవి నుంచి రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తప్పుకున్నారు. ఇటీవల కాలంలో తనపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. వివాహిత హర్ష వీణ వ్యవహారంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ..

దిశ, వెబ్ డెస్క్: దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్(YSR Kadapa District Railway Kodur Jana Sena Party MLA Arava Sridhar) తన ప్రభుత్వ విప్(Government Whip) పదవికి రాజీనామా చేశారు. ఇటీవల కాలంలో ఆయన చుట్టూ వరుస వివాదాలు, ఆరోపణలు ముసురుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా పత్రాన్ని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan)కు శ్రీధర్ అందజేశారు.
తీవ్ర సంచలనం
గత కొద్దిరోజులుగా హర్ష వీణ అనే వివాహిత వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పేరు ప్రముఖంగా వినిపించడంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వివాదంపై ఇప్పటికే ఆయన పార్టీ అధిష్టానానికి, ఉన్నతాధికారులకు తన వివరణ ఇచ్చుకున్నారు. అయినప్పటికీ, ఆ వివాదం సర్దగణక ముందే ఆయనపై మరికొన్ని కొత్త ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
రాజకీయ వర్గాల్లోనూ కలకలం
వరుసగా వస్తున్న ఆరోపణల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే అరవ శ్రీధర్ తన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. తనపై వస్తున్న విమర్శలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విప్ పదవిని వదులుకున్న ఆయన.. ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ రాజీనామా పరిణామం అటు జనసేన పార్టీలోనూ, ఇటు ఏపీ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది.






