- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి రోజా కూతురు అరుదైన ఘనత
ఇండియానా యూనివర్సిటీ అందించే అవార్డును అన్షు మాలిక అందుకోవడం పట్ల మాజీ మంత్రి రోజా హర్షం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ ప్రతి సంవత్సరం ఒక్కరికి మాత్రమే ప్రతిష్టాత్మకంగా అందించే ‘హెర్మన్ బి వెల్స్’ అవార్డు-2026కు రోజా కూతురు అన్షు ఎంపికయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రోజా ట్వీట్ కూడా చేశారు.
విద్యారంగంలో చూపే అసాధారణ ప్రతిభ, లీడర్ షిప్, క్యాంపస్ కు చేసిన సేవకు గుర్తింపుగా వర్సిటీ ఏటా ఈ అవార్డు ఇస్తుంది. ఈ ఏడాది అన్షుకు ఈ గౌరవం దక్కింది. ప్రస్తుతం ఇండియానా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు అన్షు. శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో ఎందుకు సాగుతున్న అన్షు, చదువుతో పాటు కోడింగ్, వెబ్ డెవలప్మెంట్, ఆర్ట్ ఫర్ ఏ కాజ్ లాంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు.
కూతురికి అవార్డు రావడంపై రోజా రియాక్షన్
ఇండియానా యూనివర్సిటీ అందించే అవార్డును అన్షు మాలిక అందుకోవడం పట్ల మాజీ మంత్రి రోజా హర్షం వ్యక్తం చేశారు. డియర్ అన్షు నీ కఠోర శ్రమ, అంకిత భావం, ధైర్యం కారణంగానే ఈ గౌరవం దక్కిందని పేర్కొన్నారు. డ్రీమ్స్ నుంచి డెస్టినీ వరకు తన ప్రయాణం కొనసాగుతోందని.. ఇందుకు గర్వంగా ఉందని ఎమోషనల్ అయ్యారు రోజా.






