- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సీలను క్రిస్టియన్లుగా గుర్తించాలి: పీవీ సునీల్ కుమార్
దశాబ్దాల క్రితం కారంచేడు, చుండూరు వంటి దారుణ ఘటనలు జరిగినప్పుడు మాల, మాదిగలు ఏకమై పోరాటం చేశారని, మళ్ళీ అదే ఐక్యతను చాటాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: దశాబ్దాల క్రితం కారంచేడు(Karamchedu), చుండూరు(Chunduru) వంటి దారుణ ఘటనలు జరిగినప్పుడు మాల(Mala), మాదిగలు(Madhiga) ఏకమై పోరాటం చేశారని, మళ్ళీ అదే ఐక్యతను చాటాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్(Former IPS officer PV Sunil Kumar) పేర్కొన్నారు. ఎస్సీల సమస్యలపై మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga)తో కూడా చర్చలు జరిపినట్లు వెల్లడించిన ఆయన విభేదాలను పక్కన పెట్టి దళితులందరూ ఒకే తాటిపైకి రావాలని ఆకాంక్షించారు. ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి అడుగులు వేస్తేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పీవీ సునీల్ కుమార్ స్పష్టం చేశారు.
ఎస్సీల అభ్యున్నతికి సంబంధించి కీలక డిమాండ్లను ముందుకు తెస్తూ, ఎస్సీ వాడలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలని సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. దీనివల్ల స్థానికంగా పాలనాధికారం దక్కుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఎస్సీలను క్రిస్టియన్లుగా గుర్తించాలనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దళితుల ఆత్మగౌరవం, హక్కుల రక్షణ కోసం ఐక్య పోరాటాలే శరణ్యమని పీవీ సునీల్ కుమార్ తెలిపారు.






