- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ సంకల్పం వెలుగులు నింపింది: పీవీ సింధు
గ్రామాల్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ పరిశుభ్రమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన 'మ్యాజిక్ డ్రెయిన్ల'పై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రశంసలు కురిపించారు...

దిశ, వెబ్ డెస్క్: గ్రామాల్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ వ్యవస్థ(Drainage system)ను ప్రక్షాళన చేస్తూ పరిశుభ్రమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు ఏపీ ప్రభుత్వం(Ap Government) చేపట్టిన 'మ్యాజిక్ డ్రెయిన్ల'(Magic Drains)పై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు(Badminton player PV Sindhu) ప్రశంసలు కురిపించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) సంకల్పంతో పల్లెల్లో వెలుగులు నిండుతున్నాయని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇంకుడు కాలువలతో కూడిన ఈ వినూత్న వ్యవస్థ మురుగు రహిత గ్రామాలను ఆవిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తోందని పీవీ సింధు పేర్కొన్నారు.
డ్రెయిన్లతో పోలిస్తే ఖర్చు ఆదా
సాధారణ సిమెంట్ డ్రెయిన్లతో పోలిస్తే ఈ మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం 80 శాతం ఖర్చును ఆదా చేస్తోందని సింధు గుర్తుచేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ సంకల్పం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా వీటిని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. తక్కువ ఖర్చుతో పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం అభినందనీయమని పీవీ సింధు వెల్లడించారు.
పీవీ సింధుకి ధన్యవాదాలు
పల్లె ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతపై మ్యాజిక్ డ్రెయిన్లు చూపుతున్న సానుకూల ప్రభావంపై తన విలువైన అభిప్రాయాన్ని పంచుకున్న పీవీ సింధుకి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. గ్రామ వికాసం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సమాజంలోని ప్రముఖుల నుంచి లభిస్తున్న మద్దతు ఎంతో స్ఫూర్తిదాయకమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.






