Pushpa-2:‘పుష్ప అంటే వైల్డ్‌ఫైర్ కాదు.. వరల్డ్ ఫైర్’.. మాజీ మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

by Jakkula.Mamatha |   (  Updated:2024-12-06 16:32:29  IST  )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప-2 మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.

Pushpa-2:‘పుష్ప అంటే వైల్డ్‌ఫైర్ కాదు.. వరల్డ్ ఫైర్’.. మాజీ మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప-2 మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. నేడు(గురువారం) ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన పుష్ప-2 చిత్రం(Pushpa 2) పాజిటివ్ టాక్‌తో సినీ అభిమానులు అలరిస్తోంది. ఇక సినిమా చూసిన బన్నీ ఫ్యాన్స్, సినీ అభిమానులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని ట్విట్టర్(Twitter) వేదికగా షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప 2 మూవీ పై కొందరు పనిగట్టుకుని కుట్రలు చేస్తున్నారని, కావాలని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని, సినిమాను చూడకుండా ఎవరూ అడ్డుకోలేరని ఇదివరకే మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) పుష్ప-2 మూవీ పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పుష్ప అంటే వైల్డ్‌ఫైర్ అనుకుంటివా. కాదు.. వరల్డ్ ఫైర్’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తన ట్వీట్‌కు ఫైర్ ఎమోజీని ఆయన జోడించారు. సినిమా విడుదలైన నేపథ్యంలో ఈ విధంగా ఆయన రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ ఒక ఇంటర్నేషనల్ స్టార్(International Star) అని అంబటి ప్రశంసలు కురిపించారు.

Read More...

Pushpa-2: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పుష్ప-2 నిర్మాతలు.. ఎందుకో తెలుసా?


Next Story