తిరుపతిలో దారుణం.. కత్తి, కర్రతో సైకో వీరంగం

by velandi.Saikiran |   (  Updated:2025-07-07 10:11:28  IST  )

తిరుపతిలో ( Tirupathi) దారుణం చోటు చేసుకుంది. కత్తి, కర్ర పట్టుకుని సైకో వీరంగం సృష్టించింది. ఈ సంఘటన నేపథ్యంలో

తిరుపతిలో దారుణం.. కత్తి, కర్రతో సైకో వీరంగం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో ( Tirupathi) దారుణం చోటు చేసుకుంది. కత్తి, కర్ర పట్టుకుని సైకో వీరంగం సృష్టించింది. ఈ సంఘటన నేపథ్యంలో ముగ్గురుపై దాడిచేయగా ఒకరు మృతి చెందారు. ఇరువురికి గాయాలు అయ్యాయి. అలిపిరి (Alipiri) పోలీస్ స్టేషన్ పరిధిలోని కపిల్ తీర్థం రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో గాయపడిన మృతుడు శేఖర్ (55) గా గుర్తించారు పోలీసులు.

కపిలతీర్థం పార్కింగ్ లో పనిచేసే సుబ్రహ్మణ్యం, అదే ప్రాంతంలో ఉంటున్న కల్పనకు గాయాలు అయ్యాయి. దింతో రుయా ఆసుపత్రికి తరలించారు. దాదాపు గంటసేపు స్థానికులు, పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది ప్రయాసలు పడి నిందితున్ని వలవేసి పట్టుకున్నారు. తమిళనాడుకు (Tamilnadu) చెందిన సైకోగా గుర్తించి బంధించారు అలిపిరి పోలీసులు. అక్కడి నుంచి ఆ సైకోను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story