- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారు : సీఎం రేవంత్ రెడ్డి
ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహనీయులు సత్యసాయిబా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహనీయులు సత్యసాయిబా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, భారత ఉప రాష్ట్రపతితో కలిసి పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అరుదైన అవకాశంగా భావిస్తున్నాం అన్నారు. ఆయన ప్రేమతో మనుషులను గెలిచారు.. సేవలతో దేవుడిగా కొలవబడుతున్నారన్నారు. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని సత్యసాయిబాబా నిరూపించారన్నారు. బాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యతన్నారు. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను సత్యసాయిబాబా ట్రస్టు నెరవేర్చిందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరికి చదువు అందించాలని సత్యసాయిబాబా బలంగా విశ్వసించారన్నారు. కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచిత విద్యను అందించారని తెలిపారు. చివరి దశలో ఉన్న లక్షల మంది పేదలకు సరైన వైద్యం అందేలా చూశారన్నారు. పాలమూరు వంటి వలస జిల్లాకు తాగునీటి సదుపాయం కల్పించారని గుర్తు చేసుకున్నారు. అనంతపురం జిల్లాకు కూడా తాగునీటి వసతులను కల్పించారన్నారు.
ఏపీ, తెలంగాణకే కాకుండా తమిళనాడులో తాగునీటి సమస్యను పరిష్కరించిన గొప్ప సమాజ సేవకులు సత్యసాయిబాబా అని కొనియాడారు. తన ప్రేమ సందేశం ద్వారా మనుషుల్లో దేవుడిగా శాశ్వతస్థానాన్ని పదిలం చేసుకున్నారన్నారు. మానవ సేవే మాధవ సేవ అని బోధించడమే కాదు.. ఆచరణలో చేసి చూపించారని తెలియజేశారు. విద్య, వైద్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించి చూపించారన్నారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన ధైర్యాన్ని అందించారన్నారు. 140 దేశాల్లో సత్యసాయిబాబాకు భక్తులు ఉన్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా బాబా భక్తులు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. సత్యసాయిబాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యతని సభాముఖంగా తెలిపారు.
READ MORE ....
నేడు పుట్టపర్తికి విచ్చేయనున్న తెలంగాణ సీఎం






