- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala News:శ్రీవారి సేవలో ప్రముఖ సినీ నిర్మాత
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తిరుమల(Tirumala) చేరుకొని భక్తి శ్రద్ధలతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో ఇవాళ(శుక్రవారం) శ్రీవారిని ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు.
ఈ రోజు(శుక్రవారం) వేకువ జామున వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మొదటగా టీటీడీ(TTD) అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సినీ నిర్మాత సురేష్ బాబు(Suresh Babu)కు పండితుల వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఆయనతో పలువురు సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. సురేష్ బాబు మాట్లాడుతూ.. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు.






