Video Viral:స్కూల్లో ‘పల్సర్ బైక్’ పాటకు ప్రిన్సిపాల్ అదిరిపోయే స్టెప్పులు!

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-15 09:19:16  IST  )

విద్యార్థులు పది సంవత్సరాలు ఒకే స్కూల్లో చదువుకుని అందరితో ఐక్యమత్యంగా ఉంటూ ఎంతో అందమైన జీవితాన్ని గడుపుతారు.

Video Viral:స్కూల్లో ‘పల్సర్ బైక్’ పాటకు ప్రిన్సిపాల్ అదిరిపోయే స్టెప్పులు!
X

దిశ,వెబ్‌డెస్క్: విద్యార్థులు పది సంవత్సరాలు ఒకే స్కూల్లో చదువుకుని అందరితో ఐక్యమత్యంగా ఉంటూ ఎంతో అందమైన జీవితాన్ని గడుపుతారు. కుల మత భేదాలకు తావులేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇక పదో తరగతి ముగింపు సమయంలో విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంత కాలం తమ స్నేహితులు, టీచర్స్‌తో కలిసి ఎంతో ఆనందంగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని విద్యార్థులు ఎమోషనల్ అవుతారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాలు, ఆటపాటలతో అలరిస్తారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో చిత్తూరు జిల్లాలోని పచ్చికాపల్లం ఉన్నత పాఠశాలలో (School) పదో తరగతి విద్యార్థులకు గ్రాండ్‌గా ఫేర్ వెల్ పార్టీ(Farewell party) నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థులందరూ డాన్స్‌లు వేస్తు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అయితే టెన్త్ విద్యార్థుల ఫేర్‌వెల్ డే సందర్భంగా టీచర్లు డాన్సులతో అదరగొట్టారు. ఈ వీడ్కోలు సమావేశంలో ప్రిన్సిపాల్(Principal) డాన్స్‌తో అదరగొట్టారు. విద్యార్థులతో కలిసి ప్రిన్సిపాల్ ‘పల్సర్ బైక్’ పాటకు అదరిపోయే స్టెప్పులు వేశాడు. ఇక మరో ఉపాధ్యాయుడు, మహిళా టీచర్ కలిసి కమలహాసన్ ‘స్వాతి ముత్యం’ మూవీలోని ‘సువ్వి సువ్వి సువ్వాలమ్మ’ సాంగ్‌తో అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు టీచర్లు కూడా చిన్నపిల్లాల్లా మారి ఆడిపాడటంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story