ఆ విషయంలో చంద్రబాబును మించిన వ్యక్తి మరొకరు లేదు.. ప్రధాని మోడీ ప్రశంస

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-02 12:20:02  IST  )

అమరావతి(Amaravati) పునర్నిర్మాణ పనులను ప్రధాని మోడీ(PM Modi) ప్రారంభించారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.

ఆ విషయంలో చంద్రబాబును మించిన వ్యక్తి మరొకరు లేదు.. ప్రధాని మోడీ ప్రశంస
X

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి(Amaravati) పునర్నిర్మాణ పనులను ప్రధాని మోడీ(PM Modi) ప్రారంభించారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి పుణ్యభూమి అని కొనియాడారు. అమరావతి కేవలం నగరం మాత్రమే కాదు.. ఐదు కోట్ల మంది ప్రజల కల అని అన్నారు. ఇంతగొప్ప నగరాన్ని నా చేతులమీదుగా ప్రారంభించడం గర్వంగా ఫీలవుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక శక్తిగా అమరావతి తీర్చిదిద్దుతుందనే నమ్మకం నాకు కలుగుతోందని అన్నారు. అమరావతితో ప్రతీ ఆంధ్రుడి కల నెరవేరుతుందని చెప్పారు. దేశంలోనే నెంబర్ నగరంగా అమరావతి అవుతుందని అన్నారు. ఇది వికసిత్ భారత్‌కు బలమైన పునాది అవుతుందని వెల్లడించారు.

అమరావతిలో దాదాపు రూ.60 వేల కోట్ల పనులు ప్రారంభం చేసుకున్నామని అన్నారు. ఇంద్రలోకాని అమరావతే రాజధాని అని.. యాదృచ్ఛింకంగా ఆంధ్రాకు కూడా అమరావతే రాజధాని కావడం అద్భుతమైన విషయం అన్నారు. వేగం, క్లాలిటీ, టెక్నాలజీతో నిర్మాణం జరగాలంటే.. చంద్రబాబు(Chandrababu)ను మించిన వ్యక్తి మరొకరు లేరు అని తెలిపారు. టెక్నాలజీ అందరికంటే ముందుగా అందిపుచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అని.. ఆయన హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే సమయంలో తాను.. దగ్గరనుంచి చూసి నేర్చుకున్నానని అన్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. ఎంత వేగంగా నిర్మాణం చేయదల్చుకుంటే.. అంత వేగంగా కేంద్రం ఏపీకి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

తాను, చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan).. ముగ్గరం కలిసి ఏపీ ప్రజలకు అద్భుతమైన నగరాన్ని కానుకగా ఇవ్వబోతున్నామని అన్నారు. ఎన్టీఆర్ కలలుగన్నట్లు ఆంధ్రాను అభివృద్ధి చేస్తాం.. అది మా ముగ్గురి బాధ్యత అని కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. పోలవరం ప్రాజెక్ట్‌ను కూడా వీలైనంతా త్వరగా పూర్తి చేసి.. రైతులకు మంచి రోజులు తీసుకొస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ చాలా విషయాల్లో దేశం గర్వపడేలా చేస్తోంది.. ఇక్కడి శ్రీహరి కోట నుంచి ప్రయోగించే ప్రతీ రాకెట్ చరిత్రలో నిలిచిపోతోందని అన్నారు. కాగా, ముందుగా ప్రసంగాన్ని మోడీ తెలుగులో ప్రారంభించారు. ‘తల్లి దుర్గ భవానీ కొలువైన పుణ్య భూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.

Next Story