- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతి పున:నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati) పున:నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఘనంగా ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati) పున:నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఘనంగా ప్రారంభించారు. ఆయనతో గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం కల్యాణ్(Pawan Kalyan), కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో మొత్తం రూ.58వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఇందులో మొత్తం 18 ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు రాజధాని పునఃనిర్మాణ వేడుకకు అమరావతి ప్రాంత రైతులతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. సభావేదిక వద్ద గ్యాలరీలన్నీ నిండిపోయాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని.. ఆంధ్రా ప్రజలే కాకుండా మొత్తం తెలుగువారు గర్వపడేలా నగరాన్ని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మూడేళ్ల తర్వాత మరోసారి మోడీని రప్పించుకుని ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేసుకుందామని అన్నారు. వరల్డ్ క్లాస్ నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో ఏనాడూ తలొగ్గకుండా పోరాటం చేసిన రైతులను ఈ సందర్భంగా అభినందించారు.






