వాగులో కలియుగ ప్రత్యక్ష దైవం.. అద్భుతమంటూ పూజలు

by Disha Web Desk 16 |
వాగులో కలియుగ ప్రత్యక్ష దైవం.. అద్భుతమంటూ పూజలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ వాగులో వెంకటేశ్వర స్వామి విగ్రహం లభ్యమైంది. మండుతున్న ఎండల దెబ్బతో వాగులోని నీరు ఎండిపోయింది. అయితే స్థానికులకు వాగులో విగ్రహం కనిపించింది. దీంతో స్థానికంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. వాగులోకి దిగి విగ్రహాన్ని బయటకు తీశారు. స్థానిక బ్రాహ్మణ సంత్రం వద్ద ఉంచి స్వామి వారి విగ్రహానికి పూజలు చేస్తున్నారు.

ఈ విషయం చుట్టు గ్రామాల ప్రజలకు తెలియడంతో రాచర్ల మండలం కనక సురభేశ్వరకోనకు భారీగా తరలివస్తున్నారు. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించుకునేందుకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే ఈ విగ్రహం పురాతనమైందని గ్రామస్తులు భావిస్తున్నారు. గుడికట్టి విగ్రహ ప్రతిష్టాపన చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.


Next Story

Most Viewed