Breaking: వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన స్కూటీ.. ముగ్గురు బాలురు దుర్మరణం

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-11-17 11:05:38  IST  )

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

Breaking: వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన స్కూటీ.. ముగ్గురు బాలురు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: వాటర్ ట్యాంకర్‌(Water tanker)ను స్కూటీ(Scooty) ఢీకొన్న ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు(Prakasam District Ongole) సమీపం కొప్పోలులో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు బాలురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు యశ్వంత్, వికాస్, విశాల్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముగ్గురు బాలురు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ముగ్గురు బాలురు కూడా 15 ఏళ్లలోపే వారు కావడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story