ప్రకాశం : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-30 04:51:16  IST  )

తప్పిన ప్రమాదం. మరమ్మతులు చేస్తున్న సిబ్బంది.

ప్రకాశం : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఒక భారీ రైలు ప్రమాదం (Train Accident) చోటు చేసుకుంది. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్ (Ammanabrolu Railway Station) సమీపంలో ఒక గూడ్స్ రైలు (Goods Rail) అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. ఈ ప్రమాద తీవ్రతకు గూడ్స్ బోగీలు పట్టాలు తప్పి (Derailed) ఏకంగా రెండు లైన్లపై పడిపోవడంతో విజయవాడ - చెన్నై (Vijayawada-Chennai) ప్రధాన రైల్వే మార్గంలో కొంత ఇబ్బంది తలెత్తింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, సాంకేతిక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించారు. పట్టాలపై పడిపోయిన బోగీలను తొలగించి దెబ్బతిన్న ట్రాక్‌కు మరమ్మతులు చేసే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకల్లో ఎటువంటి ఆలస్యం జరగలేదని అధికారులు తెలియజేశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది. రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Next Story