జగ్గన్న తోటలో ప్రభల తీర్థం.. మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

గోదావరి జిల్లాలో ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతుంది.

జగ్గన్న తోటలో ప్రభల తీర్థం.. మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఏపీలో నాలుగు రోజుల సంక్రాంతి సంబరాల్లో భాగంగా నేడు కనుమ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ తరుణంలో గోదావరి జిల్లాలో ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట కొబ్బరితోటలో కనుమ పండుగ రోజు ప్రభల తీర్థం ఘనంగా నిర్వహిస్తారు.

ఈ ప్రభల తీర్థంలో కోనసీమ చుట్టుపక్కలున్న 11 గ్రామాల ప్రభలు పాల్గొనడం విశేషం. ఈ నేపథ్యంలో ఏపీ(Andhra Pradesh) ప్రజలు ఘనంగా జరుపుకుంటున్న ప్రభల తీర్థం వేడుక పై వైసీపీ అధినేత వైఎస్ జగన్(Former CM YS Jagan) ఆసక్తికర ట్వీట్ చేశారు. కోనసీమలో శతాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయ ప్రభల తీర్థం వేడుకల సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజలందరూ ఈ ఉత్సవాలను ఆనందోత్సావాలతో సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు.

Next Story