- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: ఏపీ సచివాలయంలో పోలింగ్.. సాయంత్రం ఫలితాలు
ఏపీ సచివాలయంలో పోలింగ్ కొనసాగుతోంది....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సచివాలయం(Andhra Pradesh)లో పోలింగ్(Election Poling) కొనసాగుతోంది. సెక్రటేరియట్ అసోసియేషన్(Secretariat Association) కోసం ఎన్నికలు జరగుతున్నాయి. సచివాయంల మూడో బ్లాకులో ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. లెక్కింపు ముగిసిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. ఏపీ సచివాలయం అసోషియేషన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు సహా కార్యవర్గ సభ్యుల ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అప్స అధ్యక్ష పదవికి రామకృష్ణ, కాటంరాజు, కోటేశ్వరరావు పోటీ చేశారు. ఇక ఎన్నికల ప్రత్యేక అధికారి జంపని శివయ్య పర్యవేక్షణలో ఈ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1162 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌కు 75 ఓట్లు వేయనున్నారు. 9 అప్సా కార్యవర్గ పదవులకుు ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 23 మంది పోటీ చేస్తున్నారు. ఏడు బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.






