టీడీపీ నేతల నివాసాల్లో పోలీసుల సోదాలు!

by Disha Web Desk 14 |
టీడీపీ నేతల నివాసాల్లో పోలీసుల సోదాలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లాలో పోలీసుల సోదాలు కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లతో పాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసంపై పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారని సమాచారం. ఉదయం 5 గంటల నుంచే భారీ సంఖ్యలో పోలీసులు వారి ఇళ్లను చుట్టుముట్టి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ జెడ్పీటీసీ ముప్పాళ్ల విజేతరెడ్డి నివాసంలో దాదాపు రెండు గంటలపాటు పోలీసులు విస్తృత సోదాలు జరిపారు.

కేవలం రూ.25 వేలు మాత్రమే ఉండటంతో చేసేదేమిలేక వెనుదిరిగారు. మరో నేత కోట గురుబ్రహ్మం నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. రెండు గంటల నుంచి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. విజేత రెడ్డి ఇంట్లో సోదాలు ముగిసిన వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు. పోలీసుల తీరుపై కోటంరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తారా? అని మండిపడ్డారు. మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఉందని, అన్ని వ్యవస్థలు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.

Read More..

నేడు పెనుకొండలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన



Next Story

Most Viewed