బెదిరింపుల కేసు: కోర్టుకు ఎమ్మెల్సీ అనంతబాబు

by Vemula.Srinu Prasad |

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సాక్షులను బెదిరించిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం శనివారం ఆయనను సర్పవరం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు....

బెదిరింపుల కేసు: కోర్టుకు ఎమ్మెల్సీ అనంతబాబు
X

దిశ, వెబ్ డెస్క్: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సాక్షులను బెదిరించిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం శనివారం ఆయనను సర్పవరం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకుముందు కాకినాడ జీజీహెచ్‌లో అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ధర్మాసనం ఎదుట ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఇరువార్గాల వాదనలు జరుగుతున్నాయి. వాదనలు పూర్తి అయిన వెంటనే జడ్జి ఆదేశాలుండనున్నాయి

కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌గా సుబ్రహ్మణ్యం పని చేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి అదే కారులో కాకినాడలోని అతని నివాసానికి సమీపంలో వదిలివెళ్లారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణలో అనంతబాబును నిందితుడిగా తేల్చారు. ఆ మేరకు ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు అనంతబాబు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతోంది.

అయితే ఈ కేసులో సాక్షులుగా ఉన్న పలువురిని అనంతబాబు అనుచరులు నిర్బంధించారు. అనంతబాబుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని లేనిపక్షంలో చంపేస్తామని బెదిరించారు. దీంతో బాధితులు సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో కీలక ఆధారాలు సేకరించారు. ఈ వ్యవహారంలోనూ అనంతబాబునే ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు.

Next Story