రూ.7.11 కోట్ల ఏటీఎమ్ వాహనం చోరీ.. చిత్తూరులో జిల్లాలో గుర్తింపు

by Vemula.Srinu Prasad |

ఆర్బీఐ అధికారులమని చెప్పి బెంగళూరులో ఏటీఎమ్ వాహనాన్ని చోరీ చేసిన కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు..

రూ.7.11 కోట్ల ఏటీఎమ్ వాహనం చోరీ.. చిత్తూరులో జిల్లాలో గుర్తింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్బీఐ అధికారులమని చెప్పి బెంగళూరు(Bangalore)లో ఏటీఎమ్ వాహనాన్ని(ATM vehicle) చోరీ(theft) చేసిన కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. రూ.7.11 కోట్లతో ఉన్న వాహనాన్ని దుండగులు బుధవారం మధ్యాహ్నం చోరీ చేశారు. ప్రస్తుత ఈ వాహనాన్ని చిత్తూరు జిల్లా(Chittoor District) గుడిపాల దగ్గర గుర్తించారు. అయితే వాహనాన్ని వదిలి నగదుతో దుండగులు పరారయ్యారు. చిత్తూరు వైపు నుంచి తమిళనాడుకు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో నిందితులను పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులతో పాటు కర్ణాటక అధికారుల టీములు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఏటీఎంలో డబ్బు జమ ఏజెన్సీ సభ్యులను కూడా సైతం పోలీసులు విచారిస్తున్నారు.

Next Story