నడి రోడ్డుపై బర్త్ డే పార్టీ.. బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-29 10:56:01  IST  )

నడిరోడ్డుపై బర్త్ డే పార్టీ నిర్వహిస్తున్న యువకులకు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు...

నడి రోడ్డుపై బర్త్ డే పార్టీ.. బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: అసాంఘిక కార్యక్రమాలపై పోలీసు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి గంజాయి, డ్రగ్స్‌ను పట్టుకుంటున్నారు. పటిష్టమైన వ్యవస్థతో శాంతి భద్రతలు కాపాడుతున్నారు. పట్టణ, గ్రామాల్లో పటిష్ట నిఘా పెట్టారు. అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో రాత్రి సమయంలో పోలీసులు మరింత నిఘా పెట్టారు. డ్రోన్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. రోడ్డు పక్కన ఆటోలు నిలిపి మద్యం సేవించడం, పేకాట, బర్త్ డే పార్టీలు చేసుకోవడం వంటి వాటిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తిరుపతి, తిరుమలలో రోడ్లపై బర్త్ డే పార్టీలు నిర్వహిస్తున్న యువకులకు కౌన్సిల్ ఇచ్చారు.

గత రాత్రి నడిరోడ్డుపై కొందరు యువకులు బర్త్ డే పార్టీ చేసుకున్నారు. అయితే ఈ ఘటనను పోలీసులు డ్రోన్ ద్వారా గుర్తించారు. వెంటనే స్పాట్‌కు పోలీసులు వెళ్లడంతో యువకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. యువకులందరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి రోడ్డుపై బర్త్ డే పార్టీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. డ్రోన్ల సాయంతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు పట్టుకుంటున్నారు.

Next Story