- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పా ముసుగులో వ్యభిచారం.. విటుడు, ఇద్దరు మహిళలు అరెస్ట్
by Vemula.Srinu Prasad |
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ డాబాలో పోలీసుల తనిఖీలు కలకలం రేపాయి....

X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలు(Ongole)లో ఓ డాబాలో పోలీసుల తనిఖీలు కలకలం రేపాయి. స్పా(Spa) ముసుగులో వ్యభిచారం(Adultery) జరుగుతుందన్న సమాచారంతో దాడులు చేశారు. దీంతో ఓ విటుడుతో పాటు ఇద్దరు మహిళలను గుర్తించారు. ఒంగోలు బాలాజీరావుపేట పోలేరమ్మ గుడి సమీపంలోని డాబాపై ఎప్పటి నుంచో స్పా నిర్వహిస్తున్నారు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు తనిఖీలు చేసి వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్ధారించారు. ముగ్గురు నిందితులను కూడా రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు. చట్ట విరుద్ధమైన పనులు ఎవరూ చేయొద్దని.. అలా చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు.
Next Story






