- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల ఆపరేషన్.. మావోయిస్టు కీలక నేత చైతో అరెస్ట్
మావోయిస్టు కీలక నేత చైతోను పోలీసులు అరెస్ట్ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ కగార్(Operation Kagar)తో దేశంలో మావోయిస్టు(Maoist) నేతలపై కేంద్రం(Central) ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్‌లో భాగంగా పలుచోట్ల జరిగిన ఎన్ కౌంటర్లలో మవోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. మరికొన్ని చోట్ల పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఏపీ, తెలంగాణలోనూ ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.
తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల(G.Madugula) ఏజెన్సీలో పోలీసులు ఆపరేషన్ కొనసాగించారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ సాగించారు. దీంతో మావోయిస్టు కీలక చైతో అలియాస్ సంతును అరెస్ట్ చేశారు. పిస్టల్‌తో పాటు రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మాడుగుల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం చైతోను పోలీసులు విచారిస్తున్నారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.






