- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్‌కు ముందే యాక్సిడెంట్.. ఆ తర్వాతే బస్సు ప్రమాదం.. వెలుగులోకి కొత్త కోణం
బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు...

దిశ, వెబ్ డెస్క్: బస్సు ప్రమాద(Bus Accident) ఘటనపై పోలీసులు(Police) ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓ డ్రైవర్ శివనారాయణ(Driver Sivanarayana)ను అదుపులోకి తీసుకున్నారు. మరో డ్రైవర్ లక్ష్మయ్య కోసం గాలిస్తున్నారు. ప్రమాదంపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే బస్సు ప్రమాద ఘటనపై కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బస్సును బైక్ ఢీకొట్టడం వల్లే మంటలు చెలరేగాయని ప్రాథమికంగా తెలిసింది. అయితే బస్సు స్పాట్‌కు రాకముందే బైక్‌కు యాక్సిడెంట్ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సు వచ్చి బైక్‌ను ఢీకొట్టిన తర్వాతనే ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది.
అయితే డ్రైవర్ శివనారాయణ కీలక విషయాలు చెప్పినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ‘‘తెల్లవారుజామున 3 గంటలకు వర్షం పడుతుంది. సడెన్‌గా శబ్ధం వచ్చింది. దిగి చూస్తే బస్సు కింద బైక్ ఉంది. ఆ తర్వాత మంటలు వచ్చాయి’’ అని డ్రైవర్ శివనారాయణ చెప్పినట్లు ఎస్పీ పేర్కొన్నారు.






