- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయచోటి రెవెన్యూ అధికారుల ఇళ్లల్లో తనిఖీలు.. భారీగా నకిలీ రికార్డులు, డీఫారాలు
అన్నమయ్య జిల్లా రాయచోటి రెవెన్యూ శాఖలో పోలీసులు, అధికారులు తనిఖీలు నిర్వహించారు...

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా రాయచోటితో పాటు సిబ్యాల డిప్యూటీ తహసీల్దార్, సిబ్బంది, వీఆర్వోల ఇళ్లల్లో పోలీసులు, అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీగా నకిలీ రికార్డులు, డిఫారాలను గుర్తించారు. రాయచోటి మండలం సిబ్యాలతో పాటు మరో రెండు చోట్ల రెవెన్యూ శాఖలో అవకతవకలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి పనికీ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. డిప్యూటీ తహశీల్దార్ నుంచి వీఆర్వోల వరకూ అందరూ అవినీతికి పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ సీరియస్ అయ్యారు. రాయచోటి నియోజకర్గంలో పలువురు రెవెన్యూ అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో పోలీసులు, అధికారులు తనిఖీలు కొనసాగించారు. ఈ తనిఖీల్లో నకిలీ దస్త్రాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు వారందరిపై కలెక్టర్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా గత ప్రభుత్వం హయాంలో రాయచోటి నియోజకవర్గంలో భారీగా భూముల అన్యాక్రాంతం జరిగినట్లు ప్రచారం జరిగింది. కొందరు నాయకులు యదేచ్ఛగా భూములను కబ్జా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఎవరూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాయచోటిలో జరిగిన భూముల కబ్జాలపై భారీగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చర్యలకు దిగారు. ఇందులో భాగంగా రాయచోటి నియోజకవర్గం రెవెన్యూ శాఖలో తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాయచోటి రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఇళ్లలో పోలీసులు, అధికారులు సోదాలు చేశారు. భారీగా రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ రికార్డుల పరిశీలన అనంతరం వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని కలెక్టర్ కార్యాలయం అధికారులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.






