- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Banakacharla : 'పోలవరం - బనకచర్ల'కు అనుమతివ్వలేం : కేంద్ర ప్రభుత్వం
ఎట్టకేలకు తెలంగాణ(Telangana)కు భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీకి భారీ షాక్ తగలగా.. తెలంగాణ(Telangana)కు భారీ ఊరట లభించింది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఇరిగేషన్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి(Utham Kumar Reddy) కేంద్రంపై తీసుకువచ్చిన ఒత్తిడి ఫలించింది. ఆంధ్రప్రదేశ్(AP) ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు(Polavaram-Banakacharla Project)కు అనుమతులు ఇవ్వలేమని కేంద్రం ఏపీకి తేల్చి చెప్పింది. పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పలు అభ్యంతరాలు లేవనెత్తింది. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని, అనుమతులు ఇవ్వాలంటే గోదావరి నదీ జల వివాదాల ట్రైబ్యునల్(GWDT) అవార్డు పరిశీలించాల్సి ఉందని తెలిపింది. కేంద్ర జలసంఘం(CWC)తో సంప్రదింపులు జరపడం అత్యవసరమని స్పష్టం చేసింది.
ఈ ప్రాజెక్టు GWDT తీర్పును ఉల్లంఘించినట్లవుతుందని ఫిర్యాదులు వచ్చాయ ఏపీకి తెలియజేస్తూ.. అనుమతులు ఇవ్వలేమని తెలిపింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గోదావరి నదీ జల వివాదాల ట్రైబ్యునల్ తీర్పును ఉల్లంఘిస్తుందని, ఆంధ్రప్రదేశ్ చేసిన డిజైన్ మార్పులు తమ జల హక్కులను కాలరాస్తాయని ఆరోపిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు EAC అనుమతులను నిలిపివేసింది.






