16న ఏపీకి ప్రధాని మోదీ.. ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

by Naga Rani Yarlagadda |

ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన ఏపీకి రానున్నారు. కర్నూల్, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటించనున్న క్రమంలో..

16న ఏపీకి ప్రధాని మోదీ.. ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన ఏపీకి రానున్నారు. కర్నూల్, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటించనున్న క్రమంలో.. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) బుధవారం సాయంత్రం వెలగపూడిలోని సచివాలయంలో మంత్రులు, అధికారులు, పోలీసులతో సమీక్ష నిర్వహించారు.

16న కర్నూల్ జిల్లాలో పర్యటించనున్న ప్రధాని మోదీ (PM Modi).. శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శనం చేసుకోనున్నారు. అనంతరం ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. ఈ క్రమంలో ప్రధాని జీఎస్టీ (GST) సంస్కరణల ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రధాని పర్యటన ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఆహారం, తాగునీటి సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు.

Next Story