కొడాలి వస్తున్నాడు ఎవడొస్తాడో రండ్రా.. పేర్నినాని సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో మూడు నెలల్లో కొడాలి నాని గుండె ఆపరేషన్ చేయించుకుని వస్తున్నాడని అన్నారు.

MLA Perni Nani Comments On Bhadrachalam
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో మూడు నెలల్లో కొడాలి నాని గుండె ఆపరేషన్ చేయించుకుని వస్తున్నాడని అన్నారు. గుడివాడలో అడుగుపెడతాడని ఎవడొస్తాడో రండ్రా.. అండర్ వేర్ మీద నిలబెట్టడానికి అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. అంతే కాకుండా మంత్రి కొల్లు రవీంద్ర పెద్ద నటుడు అని అన్నారు. చంద్రబాబు కేబినెట్ లోనూ ఇదే విషయం మాట్లాడుకుంటున్నారని చెప్పారు.

తండ్రీ కొడుకు ఇద్దరినీ పట్టేశాడని అంతా అనుకుంటున్నారని అన్నారు. కొల్లు రవీంద్ర పక్కన కూర్చునే మంత్రులే ఈ మాటలు అంటున్నారని అన్నారు. సెక్రటరేట్‌లో సగం మంది ఇదే మాట్లాడుకుంటున్నారని చెప్పారు. చూస్తే ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు కానీ ఇన్ని కలలు ఉన్నాయా అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చీకట్లో నరికేయండి అని తాను అనలేదని, అనాలంటే పట్టపగలే చేసేయాలని చెబుతానని అన్నారు. అలా అనను అని తన సంస్కారం అలాంటి కాదన్నారు.

Next Story