- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబును లోకేష్ గద్దె దించుతారు: పేర్నినాని
ఏదో ఒకరోజు చంద్రబాబును లోకేష్ గద్దె దించుతాడు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వాళ్లు చంపుకుని వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: ఏదో ఒకరోజు చంద్రబాబును లోకేష్ గద్దె దించుతాడు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వాళ్లు చంపుకుని వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. శిశుపాలుడి పాపాలు పెరిగినట్టు లెక్కకు మించి పాపాలు చేస్తున్నారని అన్నారు. చక్రవడ్డీతో సహా ఆ పాపాలకు పర్యవసానం దారుణాతి దారుణంగా అనుభవిస్తారని హెచ్చరించారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అన్నారు. చంద్రబాబే కాంగ్రెస్ నుండి ఎన్టీఆర్ కాళ్ల వద్దకు చేరిన పెద్ద కోవర్టు అని అన్నారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు.
చంద్రబాబు చేసిన పాపాలు ఊరికే పోవు అని మండిపడ్డారు. పాపాల వల్లనే ఎన్టీఆర్ పై నుండి లోకేష్‌తో చంద్రబాబు కాళ్లు లాగిస్తున్నారని అన్నారు. రేపో మాపో ముఖ్యమంత్రి కుర్చీలో నుండి కూడా లాగేసే రోజు వస్తుందని అన్నారు. జగన్ కుటుంబంలో జరుగుతున్న విషయాల గురించి లోకేష్ మాట్లాడుతున్నాడని, చంద్రబాబు అన్నదమ్ములు అక్కాచెలెళ్లు ఏనాడైనా కనిపించారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మూడు ఇల్లు కడితే ఒక్కసారి కూడా రాలేదని అన్నారు. లోకేష్ ఏనాడైనా నారా ఖర్జూర నాయుడి మనవడిని అని చెప్పుకున్నారా.. అని ప్రశ్నించారు. నందమూరి తారకరామారావుతో మీకేం సంబంధం అని మండిపడ్డారు. టీడీపీలో ఆధిపత్య పోరుతోనే పల్నాడులో జంట హత్యలు జరిగాయని అన్నారు. కేసులో దుర్మార్గంగా పిన్నెల్లి సోదరులను ఇరికించారని అన్నారు. హంతకులు ఎమ్మెల్యే జూలకంటి సన్నిహితులు అని చెప్పారు.






