జగన్ పాలనను పాతరేసేందుకు జనం వెయిటింగ్.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

సీఎం జగన్ పాలనను పాతరేసేందుకు ఓపికగా జనం వెయిట్ చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.జవహర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జగన్ పాలనను పాతరేసేందుకు జనం వెయిటింగ్.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం జగన్ పాలనను పాతరేసేందుకు ఓపికగా జనం వెయిట్ చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.జవహర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన కొవ్వూరో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఎంతమంది అభ్యర్థలను మార్చినా.. లాభం లేదని అన్నారు. ఇప్పటికే టీడీపీ విజయం ఖాయమైందని, ప్రజల్లో జగన్‌పై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో అసంతృప్త ఎమ్మెల్యేలు రాష్ట్రానికి షర్మిళ వస్తుందా.. లేక తెలుగుదేశంలోకి వెళ్లాలా అని ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధిలో అట్టడుగున నిలిచిందని అన్నారు. జగన్ పాలనను పాతరేయడానికి ఓపికగా ప్రజలు వెయిట్ చేస్తున్నారని అన్నారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును జగన్ పక్కన కూర్చోబెట్టుకోవడం దళితులను అగౌరవ పరచడమేనని దుయ్యబట్టారు.

Next Story