- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pensions: ఏపీలో పింఛన్ల పండగ.. మధ్యాహ్నానికి 90 శాతం పంపిణీ
పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.2,722 కోట్లు విడుదల చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో : పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.2,722 కోట్లు విడుదల చేసింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu naidu)బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. చినగంజా మండలం గొల్లపాలెంలో ఎన్టీఆర్భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వితంతువు, మానసిక దివ్యాంగురాలి ఇంటికి వెళ్లి పింఛను అందించారు. పింఛన్ల పంపిణీ అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ఆయన పాల్గొన్నారు. గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రకాశం జిల్లా పైడిపాడులో మంత్రి డీబీవీ స్వామి పింఛన్లు అందజేశారు. బాపట్ల జిల్లా జె.పంగులూరు భగవాన్రాజుపాలెంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్పింఛన్లు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా మరువాడలో మంత్రి కొండపల్లి పింఛన్లు అందజేశారు. అనకాపల్లి జిల్లా ఆరట్లకోటలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినుకొండలో ప్రభుత్వ చీఫ్విప్జీవీ ఆంజనేయులు పింఛన్లు పంపిణీ చేశారు






