- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హక్కుల కోసం పోరాడటం నేరమా? బంగ్లాదేశ్ హిందూ సాధువుకి బెయిల్ నిరాకరణపై పవన్ కల్యాణ్ ఫైర్!
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ మాంక్, హిందూ ఆధ్యాత్మిక గురువు చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభుకు పదే పదే బెయిల్ నిరాకరించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ మాంక్, హిందూ ఆధ్యాత్మిక గురువు చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభుకు పదే పదే బెయిల్ నిరాకరించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మంగళవారం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బంగ్లాదేశ్ న్యాయ వ్యవస్థ తీరును, అంతర్జాతీయ నకిలీ లౌకికవాదుల మౌనాన్ని తీవ్రంగా ఎండగట్టారు. కాషాయం ధరించిన ఓ సాధువును నేరస్థుడిలా చూస్తుంటే ప్రపంచం మౌనంగా ఉండలేదని ఆయన స్పష్టం చేశారు. ‘500 రోజులకు పైగా జైలు శిక్ష.. మళ్లీ బెయిల్ తిరస్కరణ. ప్రపంచం చూస్తుండగానే ఆయన జైలులో మగ్గుతున్నారు. ఆయన తరపున వాదించే న్యాయవాదులనూ కోర్టు కారిడార్లలో బెదిరిస్తుంటే.. ఇక అక్కడ ఎలాంటి న్యాయం ఉన్నట్లు? మైనారిటీ హిందువుల హక్కుల కోసం పోరాడటం నేరమా?’ అని పవన్ ప్రశ్నించారు.
సెలెక్టివ్ యాక్టివిస్ట్‌లు, నకిలీ లౌకికవాదుల మౌనం!
తక్షణమే ఆయనకు వైద్య సహాయం అందించడంతో పాటు, న్యాయమైన విచారణ జరపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం కోరారు. తమకు కావాల్సిన అంశాలపై రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ హడావిడి చేసే సెలెక్టివ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు, నకిలీ లౌకికవాదుల మౌనంగా ఉన్నారంటూ పవన్ ఘాటుగా విమర్శించారు.
అసలేం జరిగిందంటే..
దేశద్రోహం ఆరోపణల కింద 2024 నవంబర్ 25న ఢాకా విమానాశ్రయంలో అరెస్ట్ అయిన చిన్మయ్ కృష్ణ దాస్‌కు బంగ్లాదేశ్ హైకోర్టు ఆదివారం బెయిల్ నిరాకరించింది. గతంలో ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా ఛటోగ్రామ్‌లో జరిగిన నిరసనల్లో సైఫుల్ ఇస్లాం అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ (లాయర్) హత్యకు గురయ్యారు. ఆ హత్య కేసుకు సంబంధించి కింది కోర్టులో సాక్షుల విచారణ కొనసాగుతున్నందున బెయిల్ ఇవ్వలేమని ఇద్దరు న్యాయమూర్తుల హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగిన తర్వాత బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులు, వివక్షను వ్యతిరేకిస్తూ చిన్మయ్ కృష్ణ దాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు జరిగాయి. ఆ తర్వాతే ఆయనపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం జైలులో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాదులు కోరినా ఫలితం లేకుండా పోయింది. కాగా, ఈ వ్యవహారం, చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు పరిణామాలపై భారత్ ఇప్పటికే పలుమార్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.






