- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని సమక్షంలో కశ్మీర్ ఉగ్రదాడిపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ(YCP) ఐదేళ్ల పాలనలో అమరావతి రైతులు ఎంతో నలిగిపోయారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ(YCP) ఐదేళ్ల పాలనలో అమరావతి రైతులు ఎంతో నలిగిపోయారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. శుక్రవారం అమరావతి పున:నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి రైతులకు అండగా ఉంటామని ఐదేళ్ల క్రితం మాట ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఇచ్చిన ప్రతీ మాటకు కట్టబడి మళ్లీ ప్రధాని మోడీతో పనులు ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. అమరావతి(Amaravati) రైతుల త్యాగాలు మర్చిపోలేనివని అన్నారు. వైసీపీ హయాంలో రాజధాని తరలిపోతుందనే భయం అందరిలోనూ కలిగిందని వెల్లడించారు. గత ప్రభుత్వ తెలివిలేని చేష్టల వల్ల రైతులు, విద్యార్థులు, మహిళలు అందరూ ఇబ్బందులు పడ్డారని అన్నారు. కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగి 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రధాని మోడీ మనకు సమయం ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. తప్పకుండా పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పబోతున్నామని అన్నారు.






