- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలయాల పవిత్రతను కాపాడుతున్నాం: పవన్ కల్యాణ్
మహా శివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలంతా సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతున్నాను. శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం, శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రంతోపాటు పంచారామ క్షేత్రాలతో అలరారుతున్న పుణ్యభూమి మనది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మహా శివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలంతా సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతున్నాను. శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం, శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రంతోపాటు పంచారామ క్షేత్రాలతో అలరారుతున్న పుణ్యభూమి మనది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి క్షేత్ర పవిత్రతను కాపాడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 41 ప్రముఖ శైవ క్షేత్రాల్లో ప్రభుత్వం అధికారికంగా శివరాత్రి వేడుకలు నిర్వహిస్తుండడమే అందుకు నిదర్శనమని అన్నారు.
ఈ శివరాత్రికి రెండు రోజుల ముందు శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గంలో నూతన సిమెంటు రోడ్డు నిర్మించి ప్రారంభించాం. కోటప్పకొండ భక్తుల గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్నా, పెద్ద ఆలయాలన్నింటికీ రోడ్డు సౌకర్యం కల్పించే విధంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. ఆలయాల అభివృద్ధికి, ధర్మపరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరోసారి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికీ ఆ పరమశివుని అనుగ్రహం కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ, ప్రజలందరికీ పవన్ కల్యాణ్ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.






