ఆంధ్రా ప్రజలకు పవన్ కల్యాణ్ కీలక పిలుపు

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-20 15:29:28  IST  )

ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యువతకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక పిలుపునిచ్చారు.

ఆంధ్రా ప్రజలకు పవన్ కల్యాణ్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యువతకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రేపు విశాఖ నగరంలో లక్షలాదిమంది ప్రజల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. యోగా భారత దేశ సంస్కృతిలో భాగం. శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి సహాయపడే యోగాను మోదీ ప్రత్యేక కృషితో ప్రపంచమంతా గుర్తించి ప్రతీ సంవత్సరం జూన్ 21 ను "ప్రపంచ యోగా దినోత్సవం" జరుపుకుంటుంది. ఆయన స్వయంగా మన రాష్ట్రంలో పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను’’ అని ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

కాగా, రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం(World Yoga Day) సందర్భంగా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఆసనాలు వేసేందుకు జనం సిద్ధమవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో జరిగే యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్, అధికారులు ఘన స్వాగతం పలికారు.

Next Story