- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan kalyan: ఆయన్ని కలుసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది
ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment Day) సందర్భంగా అమరావతిలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment Day) సందర్భంగా అమరావతిలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ పెట్టారు.
‘అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబుతో కలిసి వన మహోత్సవ వేడుకల్లో పాల్గొని కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వచ్చే ఏడాది లోపు ఐదు కోట్ల మొక్కలను రాష్ట్రవ్యాప్తంగా నాట్యం సంకల్పంతో రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ పని చేయనుంది. తనకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక పక్షి ప్లాస్టిక్ వ్యర్ధాలు తిని చనిపోవడం చూసి మూడు దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న కొమెర అంకారావు లాంటి పర్యావరణ ప్రేమికుడుని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. అలాంటి వ్యక్తిని రాష్ట్ర అటవీశాఖ సలహాదారుగా నియమిస్తూ ఈ వేదిక నుండి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పర్యావరణ పరిరక్షణకు శుభపరిణామం. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతానికి పచ్చదనాన్ని పెంచేలాగా, ప్రజలందరినీ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం చేసేలాగా, అలాగే నగర వనాల సంఖ్యను పెంచడం, మియావకి అడవుల ఏర్పాటు, కార్చిచ్చుల నిరోధం కోసం, ప్లాస్టిక్ వ్యర్ధాలు నియంత్రణ కోసం రాష్ట్ర అటవీ శాఖ చిత్తశుద్ధితో పని చేయనుంది’ అని ట్వీట్‌లో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలిసి వన మహోత్సవ వేడుకల్లో పాల్గొని కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వచ్చే ఏడాది లోపు ఐదు కోట్ల మొక్కలను రాష్ట్రవ్యాప్తంగా నాట్యం సంకల్పంతో రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ పని… pic.twitter.com/H2etBGvZmO
— Pawan Kalyan (@PawanKalyan) June 5, 2025






