- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పెనలా తుడిచిపెట్టేయాలని చూశారు.. పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
ప్రధాని మోడీ(PM Modi) చేతుల మీదుగా పునఃప్రారంభం అయిన అమరావతి(Amaravati) ప్రపంచస్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తుందని, జవాబుదారీతనం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ(PM Modi) చేతుల మీదుగా పునఃప్రారంభం అయిన అమరావతి(Amaravati) ప్రపంచస్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తుందని, జవాబుదారీతనం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. అమరావతి పునఃనిర్మాణం సభలో ఆయన ప్రసంగించారు. అమరావతి రైతులు చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేశారని కొనియాడారు. వారి భూములను రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేశారని, అయితే గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును దివిసీమ ఉప్పెనలా తుడిచిపెట్టేయాలని చూసిందన్నారు. అయితే ధర్మ యుద్ధంలో రాజధాని రైతులు విజయం సాధించారని, వారి పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది పేర్కొన్నారు. అమరావతి రాష్ట్రానికే కాదు.. దేశానికే తలమానికంగా నిలుస్తుంది. అమరావతికి సహకరిస్తున్న మోడీకి ధన్యవాదాలు. భవానీ మాత మోడీని మరింత శక్తిమంతున్ని చేయాలని పవన్ ఆకాంక్షించారు.
ప్రజా రాజధాని అమరావతి పునః నిర్మాణమని ప్రారంభించేందుకు గౌ|| ప్రధాని శ్రీ @narendramodi గారు విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా పునః ప్రారంభం అవుతున్న అమరావతి ప్రపంచ స్థాయి… pic.twitter.com/vVu5mNmK3K
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) May 2, 2025






