ఢిల్లీకి పవన్ కల్యాణ్: పొత్తులపై బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించే ఛాన్స్

by Disha Web Desk 21 |
ఢిల్లీకి పవన్ కల్యాణ్: పొత్తులపై బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించే ఛాన్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ బయలుదేరారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి బయలుదేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పవన్ కల్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు. బుధవారం, గురువారం రెండు రోజులపాటు పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఉండనున్నట్లు తెలుస్తోంది.బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి భేటీ కానున్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుల లక్ష్మణ్‌లు పవన్ కల్యాణ్‌ను కలిసి పొత్తుల ప్రతిపాదన తీసుకువచ్చారు. అయితే పొత్తులపై పార్టీలో చర్చించి నిర్ణయం చెప్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తే బెటర్ అని కొందరు తెలంగాణ జనసైనికులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తుపై జాతీయ నాయకత్వం వద్ద పొత్తుపై చర్చించేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.ఎన్ని స్థానాలు జనసేన పోటీ చేయాలి, బీజేపీకి ఎన్నిసీట్లు ఉమ్మడి కార్యచరణ వంటి పలు అంశాలపై బీజేపీ అగ్రనాయకత్వం వద్ద జనసేనాని పవన్ కల్యాణ్ తేల్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ పొత్తుల వ్యవహారంపై గురువారం సాయంత్రానికి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బీజేపీ అగ్రనాయకత్వంతో పవన్ భేటీ

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటుంది. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను దశలవారీగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగుల వేస్తోంది. తెలంగాణలో జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌లు పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరు పొత్తుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అయితే పొత్తు విషయంలో పార్టీ నేతలతో చర్చించి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పవన్ కల్యాణ్ తెలియజేశారు. ఇకపోతే తెలంగాణ జనసేన నేతలు సైతం ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. కనీసం 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే బెటర్ అని నాయకులు సూచిస్తున్నారు. అంతేకాదు ఆ 32 నియోజకవర్గాల జాబితాను సైతం జనసేన సిద్ధం చేసుకుంది. అటు బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది. అలాగే జనసేన సైతం అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సి ఉంది. ఈ లోగా పొత్తులపై ఏదో ఒకటి తేల్చుకోవాలని అటు బీజేపీ, ఇటు జనసేనలు వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.

సీట్ల సర్ధుబాటుపై చర్చ

ఇదిలా ఉంటే బీజేపీ ట్రబుల్ షూటర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ ఢిల్లీలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. హస్తినలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి అగ్రనాయకులతో జనసేనాని భేటీ కానున్నట్లు తెలుస్తోంది.ఈ భేటీలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పొత్తుతోపాటు ఏపీలోని పొత్తుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే పవన్‌ను బీజేపీ కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణలో కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని జనసేన ఉవ్విళ్లూరుతుంది. ఈ నేపథ్యంలో అమిత్ షా,జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ భేటీ అత్యంత కీలకంగా మారనుంది.

ఏపీలో పొత్తుపై ఓ కొలిక్కి

ఏపీలో పొత్తుల అంశంపై కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు జేపీ నడ్డాలతో జనసేనాని పవన్ కల్యాణ్ చర్చించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో బీజేపీ,జనసేనలో పొత్తులో ఉన్నాయి. ఇంతలో టీడీపీతో ఎన్నికలకు వెళ్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ,బీజేపీలు కలిసి ఎన్నికలకు వెళ్తే మంచి జరుగుతుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అంతేకాదు బీజేపీని పొత్తుకు ఒప్పించే బాధ్యతను పవన్ కల్యాణ్ తన భుజాలపై వేసుకున్నారు. దీంతో బీజేపీ పొత్తుతో ఎన్నికలు వెళ్లాలా.. ఒంటరిగా వెళ్లాలా అన్నదానిపై ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఈ మీమాంస నుంచి బీజేపీని బయట పడేసేందుకు అలాగే 2014 ఎన్నికల మాదిరిగా మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని పవన్ కల్యాణ్ బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు, సీట్ల పంపకాలపై క్లారిటీ వచ్చిన అనంతరం ఏపీలో పొత్తుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed