- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్కార్.. డిప్యూటీ CM పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే
రాష్ట్రంలో మత్స్యకారుల వలసలు(Fishermen's Migration) తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మత్స్యకారుల వలసలు(Fishermen's Migration) తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రెట్టింపు చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తాజాగా ఆ హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రూ.10,000 నుంచి రూ.20,000 పెంచినట్లు తెలిపారు. మత్స్యకారుల సేవ పథకం ద్వారా ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి చేకూరుతోందని వెల్లడించారు. చేపల వేటపై ఆధారపడ్డ కష్ట జీవులకి ఈ రెండు నెలలు జీవనానికి ఎలాంటి సమస్య రాకుండా చేసే దిశగా ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన దశలోనే చర్చించడం జరిగిందన్నారు. ఎన్నికల హామీ కార్యరూపం దాల్చేలా చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. జీవన భృతి ఇచ్చి ఆదుకోవడం మాత్రమే కాదు.. వలసలు వెళ్తున్న మత్స్యకారులకు ఇక్కడే తగిన ఉపాధి చూపించే ఆలోచనలు కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న మన రాష్ట్రంలో, తీర ప్రాంత అభివృద్ధి ద్వారా మత్స్యకార కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా అడుగులు వేస్తామని భరోసా ఇచ్చారు.
మత్స్యకారులకు ఇచ్చిన మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది.
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) April 27, 2025
రాష్ట్రంలో మత్స్యకారుల వలసలు తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రెట్టింపు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలోని…






