కలలో కూడా ఊహించని విధంగా శిక్షించాలి.. ఢిల్లీ ఘటనపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-10 17:25:48  IST  )

ఢిల్లీలో పేలుడు(Delhi Explosion) ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లపై యావత్‌ భారతదేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

కలలో కూడా ఊహించని విధంగా శిక్షించాలి.. ఢిల్లీ ఘటనపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో పేలుడు(Delhi Explosion) ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లపై యావత్‌ భారతదేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రెండు కార్లు పేలడంతో 13 మంది మృతి చెందగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేపడుతున్నాయి. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భారత దేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఎదుగుతున్న ఈ సమయంలో, ఇలాంటి పిరికి చర్యలు మన ఏకత్వాన్ని దెబ్బతీయలేవని.. ఈ చర్యలు వారికి నిరాశను మాత్రమే చూపిస్తాయన్నారు. ఘటనకు పాల్పడిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని కోరారు. మరోవైపు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎన్‌ఎస్‌జీ, ఎన్‌ఐఏ, ఫోరెన్సిక్‌ బృందాలు సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి. పవన్ ట్వీట్

Next Story