జనసేన ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.. కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు

by Ajay Maddhiboyina |

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అమ‌రావ‌తిలో మంగ‌ళ‌గిరి జ‌న‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ ముఖ్య నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో పార్టీ సంస్థాగ‌త నిర్మాణం, క‌మిటీల ఏర్పాటు, నియోజ‌క‌వ‌ర్గాల వారిగా పార్టీ బ‌లోపేతం లాంటి అంశాల‌పై చ‌ర్చించారు.

జనసేన ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.. కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అమ‌రావ‌తిలో మంగ‌ళ‌గిరి జ‌న‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ ముఖ్య నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో పార్టీ సంస్థాగ‌త నిర్మాణం, క‌మిటీల ఏర్పాటు, నియోజ‌క‌వ‌ర్గాల వారిగా పార్టీ బ‌లోపేతం లాంటి అంశాల‌పై చ‌ర్చించారు. పార్ల‌మెంట్ నియెజ‌క‌వ‌ర్గాల వారీగా ప్ర‌త్యేక క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ప‌న‌వ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌తి క‌మిటీలో మొత్తం ఏడుగురు స‌భ్యులు ఉండేలా రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ క‌మిటీల్లో సంబంధిత పార్ల‌మెంట్ నియెజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియ‌ర్ నాయ‌కులు, మ‌హిళా నేత‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారు.

అంతేకాకుండా 2014 నుండి జ‌న‌సేన కోసం ప‌నిచేస్తున్న నాయ‌కుల‌తో పాటు ఇద్ద‌రు సాధ‌క్ల‌కు కూడా క‌మిటీల్లో స్థానం క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌తి క‌మిటీలో 10 నుండి 25 మంది సాధ‌క్‌లకు సమన్వయ బృందంగా స‌హ‌క‌రించేలా వ్య‌వ‌స్థ రూపొందించ‌నున్నారు. అంతేకాకుండా పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న అసెంబ్లీ నియెజ‌క‌వ‌ర్గ క‌మిటీల్లో చోటు ద‌క్కాల‌ని అనుకునే నాయ‌కుల నుండి ధ‌ర‌ఖాస్తులు సైతం స్వీక‌రించ‌నున్నారు. ఆ ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి స‌మ‌గ్ర నివేదిక రూపంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అంద‌జేస్తారు. ఈ నివేదిక‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని ప్ర‌త్యేక క‌మిటీ ప‌రిశీలించిన త‌ర‌వాత నియామ‌కాల‌పై తుది నిర్ణ‌యం తీసుకుంటారు. ఈ ప్ర‌క్రియ‌ను నాలుగువారాల్లో పూర్తి చేయాల‌ని ప‌వ‌న్ కల్యాణ్ నేత‌ల‌కు ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది.

Next Story