2009లోనే తెలంగాణకు మద్దతు తెలిపా.. రేర్ వీడియో షేర్ చేసి పవన్ హాట్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియా స‌మావేశం త‌ర‌వాత సైతం తెలంగాణ‌పై వ‌రుస ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఆయ‌న గ‌తంలో మీడియాతో మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధ‌న ప‌ట్ల త‌న నిబ‌ద్ధ‌త ఇటీవ‌లే మొద‌లైంది కాద‌ని అన్నారు.

2009లోనే తెలంగాణకు మద్దతు తెలిపా.. రేర్ వీడియో షేర్ చేసి పవన్ హాట్ కామెంట్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియా స‌మావేశం త‌ర‌వాత సైతం తెలంగాణ‌పై వ‌రుస ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఆయ‌న గ‌తంలో మీడియాతో మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధ‌న ప‌ట్ల త‌న నిబ‌ద్ధ‌త ఇటీవ‌లే మొద‌లైంది కాద‌ని అన్నారు. 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ యువ‌జ‌న విభాగానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న స‌మయంలోనే తాను ఉస్మానియా విశ్వ‌విద్యాల‌య విద్యార్థి నాయ‌కులు, గ‌ద్ద‌ర్ తో క‌లిసి తెలంగాణ సామాజిక న్యాయ‌స‌భ‌లో పాల్గొన్నాన‌ని పేర్కొన్నారు. దివంగ‌త వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెలంగాణ ఏర్పాటును వ్య‌తిరేకిస్తున్న స‌మ‌యంలో తాను తెలంగాణ‌కు బ‌హిరంగంగా మ‌ద్ద‌తు తెలిపానని చెప్పారు.

సామాజిక న్యాయం, ఆత్మ‌గౌరవం, స‌మాజంలోని అన్ని వర్గాల‌కు స‌మాన అవ‌కాశాలు అనే పునాదుల‌పై నిర్మించ‌బ‌డ్డ సామాజిక తెలంగాణ కోసం పిల‌పునిచ్చాన‌ని చెప్పారు. తాను కేవ‌లం రాజ‌కీయ ప్రయోజ‌నాల కోసమే తెలంగాణ‌కు మ‌ద్ద‌తు ఇవ్వలేద‌ని, తెలంగాణ‌ ప్ర‌జ‌ల ప్ర‌జాస్వామ్య ఆకాంక్ష‌, గుర్తింపు, గౌర‌వం అనేవి స‌రైన‌వేన‌ని పేర్కొన్నారు. ఆ న‌మ్మ‌కంతోనే మ‌ద్ద‌తిచ్చాన‌ని తెలిపారు. అప్పుడు తాను తీసుకున్న నిర్ణ‌యం తెలంగాణ ప‌ట్ల‌, రాష్ట్ర ప్ర‌జ‌ల ప‌ట్ల త‌న‌కు ఉన్న అచంచ‌ల‌మైన నిబ‌ద్ధ‌త‌ను ప్ర‌తిబింబిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ సాధ‌న‌కుత‌న మ‌ద్ద‌తు రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యం కాద‌ని, అది సూత్ర‌ప్రాయ‌మైన విష‌యం అని పేర్కొన్నారు. ఇక వవన్ షేర్ చేసిన వీడియోలో రిపోర్టర్ తెలంగాణపై మీ స్టాండ్ ఏంటి అని ప్రశ్నించగా.. విడిపోయినా భారత దేశంలోనే ఉంటుంది కదా అని అన్నారు. భాతరదేశం నుండి విడిపోనంతవరకు తనకు ఎలాంటి సమస్యలేదని వ్యాఖ్యానించారు.

Next Story