- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదావరి ఘాట్ ప్రాంతాల పరిశీలన.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
రాజమహేంద్రవరంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి అఖండ గోదావరి ఘాట్ ప్రాంతాలు పరిశీలించారు. ..

దిశ, వెబ్ డెస్క్: రాజమహేంద్రవరంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి అఖండ గోదావరి ఘాట్ ప్రాంతాలు పరిశీలించారు. అనంతరం నగర పాలక సంస్థ కార్యాలయంలో పుష్కరాల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌తో పాటు ఎమ్మె్ల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా పాల్గొన్నారు. నదులను మృత నదులుగా మారిస్తే భవిష్యత్తు ఉండదని ఈ సందర్భంగా వారికి సూచించారు. గోదావరి కాలుష్య నివారణకు అంతర్ శాఖల టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాదు పుష్కరాలకు రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. ఆరు నెలల్లో నదిలో మార్పు కనిపించాలన్నారు. హడావుడి పనులతో భక్తుల ప్రాణాలతో చెలగాటమొద్దని సూచించారు. పుష్కరాల ఏర్పాట్లలో 6 జిల్లాల పంచాయతీలను భాగస్వామ్యం చేయాలన్నారు. దేశం గర్వపడేలా ప్లాస్టిక్ రహిత పుష్కరాలు నిర్వహిద్దామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.






