- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తప్పదనుకుంటే గొడవే: వైసీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
కూటమి నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై పవన కల్యాణ్ సీరియస్ అయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో కూటమి నేతలు, కార్యకర్తలపై రాష్ట్రంలో దాడులు పెరుగుతున్నాయి. ప్రతి నిత్యం ఏదో ఒక ఏరియాలో టీడీపీ(Tdp) లేదా జనసేన(Janasena) కార్యకర్తలపై వైసీపీ(Ycp) శ్రేణులు దాడులు చేస్తున్నాయి. హత్యలకు సైతం వెనకాడటం లేదు. ఆదివారం రాత్రి పల్నాడు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతలను హత మార్చారు. ఈ ఘటనలపై మంగళగిరి జనసేన కార్యాలయంలో నిర్వహించిన పదవి-బాధ్యత కార్యాక్రమంలో ఆయన స్పందించారు. ఈ మేరకు వైసీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ దాడులకు జనసేన భయపడదన్నారు. వైసీపీ ఒక రౌడీ సమూహంలా అనిపిస్తోందని పవన్ అభిప్రాయం వ్యక్తం చేవారు. జగన్, వైపీపీ నేతలపై తనకు వ్యక్తిగతం వైర్యం లేదని ఆయన తెలిపారు. విధాన పరమైన కోపం, విమర్శలు మాత్రమే ఉన్నాయన్నారు. అవసరమైతే చొక్క మడతాపెడతామని చెప్పారు. రౌడీలను ప్రోత్సహించే నాయకులు తయారయ్యారని మండిపడ్డారు. అలా ప్రోత్సహించే దాన్ని పార్టీ చూడమని చెప్పారు. రౌడీ గ్యాంగ్‌గానే చూస్తామన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ వస్తే అంతుచూస్తామని హెచ్చరిడం సరికాదన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రతిపక్షం సంగతి చూస్తామని చెప్పడం విధానం కాదని చెప్పారు. తప్పదు అనుకుంటే గొడవకు దిగుతామని దాడులకు దిగుతున్న వైసీపీ శ్రేణులు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.






