TDP మాజీ ఎమ్మెల్యే మృతి.. పవన్ కల్యాణ్ సంతాపం

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-07 12:00:01  IST  )

టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం(93) మృతి చెందారు

TDP మాజీ ఎమ్మెల్యే మృతి.. పవన్ కల్యాణ్ సంతాపం
X

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం(93) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ(జూన్ 07) తుదిశ్వాస విడిచారు. పల్లా సింహాచలం మరణం పై టీడీపీ శ్రేణులు, మంత్రులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం(Palla Simhachalam) మృతికి సంతాపం తెలిపారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. పవన్ కల్యాణ్ పల్లా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ తరుణంలో సింహాచలం మృతికి మంత్రి అనగాని సత్యప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సింహాచలం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా, ఎమ్మెల్యేగా విశాఖ ప్రజలకు ఎనలేని సేవలందించారు అనగాని సత్యప్రసాద్ గుర్తు చేసుకున్నారు. పల్లా సింహాచలం మృతికి మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి, వాసంశెట్టి సుభాష్ సంతాపం తెలిపారు.

Next Story