చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన పవన్ కల్యాణ్

by Disha Web Desk 2 |
చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు 74వ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విష్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ‘రాజకీయంగా, పాలనాపరంగా చంద్రబాబు అనుభవజ్ఞులు. చంద్రబాబు నిరంతరం ఏపీ అభివృద్ధి గురించే ఆలోచిస్తారు. జైలు జీవితం గడిపినా మనో నిబ్బరం కోల్పోలేదు. రాష్ట్రాభివృద్ధి కోసం దూరదృష్టి కలిగిన నాయకుడు. చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Read More..

మంత్రి రోజా ఆస్తి వివరాలు వైరల్.. బెంజ్‌తో పాటు మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయంటే?



Next Story

Most Viewed